అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి

పనాజి (CLiC2NEWS): గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల్లో సినీ హీరో చిరంజీవి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటి ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఈ అవార్డు ఇచ్చింనందుకు ఇఫీ(IFFI), భారత ప్రభుత్వానికి దన్యవాదాలు తెలియజేశారు. ఈ క్షణం కోసం ఎన్నో దశాబ్ధల నుండి ఎదురుచూస్తున్నానని చిరంజీవి అన్నారు. గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవపు వేడుకల్లో పాల్గొన్నపుడు ఒక్క దక్షిణాది నటుడి ఫోటో లేకపోవడంపై చాలా బాధపడ్డానని, ఇప్పుడు అవార్డు అందుకోవడం అనందంగా ఉందన్నారు. సినీ ఇండస్ట్రీలో 45 ఏళ్లకు పైగా ఉన్నానని, రాజకీయంలోకి వెళ్లడం కారణంగా కొన్నాళ్లు విరామం వచ్చిందన్నారు. సినీ రంగంలోకి రీ ఎంట్రీ సమయంలో అభిమానులు ఎలా ఆదరిస్తారో అనే సందేహం ఉండేది. కానీ, ఎలప్పటిలగానే నన్ను ఆదరించి నాపై ప్రేమ చూపారన్నారు. వారికి ఎప్పుడూ నేను దాసుణ్నే.. జీవితాంతం సినీ పరిశ్రమలోనే ఉంటానని చిరంజీవి అన్నారు.
I went over this site and I conceive you have a lot of superb information, saved to my bookmarks (:.