వివేకా హత్యకేసు తెలంగాణ సిబిఐ కోర్టుకు బదిలి

ఢిల్లీ (CLiC2NEWS): వివేకా హత్యకేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ తెలంగాణ సిబిఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తన తండ్రి వివేకానంద హత్య కేసు దర్యాప్తులో సాక్షులను, నిందితులను బెదిరిస్తున్నారని.. కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టుఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపి ఈ కేసును కడప న్యాయస్థానం నుండి హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నట్లు నేడు తీర్పు వెలువరించింది.