రాష్ట్రంలో మరో 16వేల ఉద్యోగాల భర్తీకి రానున్న అనుమతులు .. సిఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది. నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించనుంది. త్వరలో మరో 16వేల పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వనున్నట్లు సిఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్థన్ రెడ్డితో కలిస వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 60,929 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఈ సందర్భంగా సిఎస్ తెలిపారు. ఇప్పుడు ఈ 16 వేల పోస్టులకు సంబంధించిన అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా త్వరితగతిన అవసరమైన సమాచారాన్ని కమిషన్‌కు అందించాలని ఆదేశించారు.
TSPSC: తెలంగాణలో భూగర్భ జలవనరుల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.