కర్నూలు జిల్లాలో కారు అదుపుతప్పి ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

కర్నూలు (CLiC2NEWS): జిల్లాలోని కోడుమూరు వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. బైక్‌ను తప్పించబోయి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు పూర్తిగా ధ్వంసంమైంది. క్షతగాత్రులను కర్నూలు ఈసుపత్రికి తరలించారు. మరణించిన వారు నంద్యాల జిల్లా ఆలగనూరుకు చెందన యలమరాజు, ఆయన కుమారుడు నారాయణ, తుగర్చేడుకు చెందిన వెంకటస్వామిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.