బస్‌స్టాప్‌లోని ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు మృతి
భోపాల్ (CLiC2NEWS): బస్‌స్టాప్‌లో ఉన్న ప్రయాణికుల మీదకు ఓ ట్రక్కు వేగంగా దూసుకెళ్లి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి.
క్షత గాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.