క్యూలైన్‌లో నిల్చుని ఓటేసిన పిఎం మోడీ

గాంధీన‌గ‌ర్ (CLiC2NEWS): గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు రెండో విడ‌త పోలింగ్ ఇవాళ (సోమ‌వారం) కొన‌సాగుతోంది. ఇవాళ ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఓటేయ‌డానికి ప్ర‌ధాన‌మంత్ర న‌రేంద్ర మోడీ ఇవాళ ఉద‌యం గాంధీన‌గ‌ర్ రాజ్‌భ‌వ‌న్ నుంచి అహ్మ‌దాబాద్ చేరుకున్నారు. రాణిప్‌లో గ‌ల ప‌బ్లిక్ స్కూల్ లో ప్ర‌ధాని మోడీ త‌న ఓటును వేయ‌నున్నారు.

పోలింగ్ బూత్ వ‌ద్ద సామ‌న్య ప్ర‌జీనీకంతో క‌లిసి ప్ర‌ధాని క్యూలైన్‌లో నిలబ‌డి త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అలాగే గుజ‌రాత్ సిఎం భూపేంద్ర ప‌టేల్ అహ్మ‌దాబాద్‌లో ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా అహ్మదాబాద్‌లోనే త‌న ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. ఈ రెండో విడ‌త భాగంగా 14 జిల్లాల్లోని 93 నియోజ‌క వ‌ర్గాల్లో పోలింగ్ కొన‌సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.