ప్రేమోన్మాది చేతిలో మరో అమ్మాయి బలి
పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమించిన అమ్మాయిని హత్య చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

అమరావతి (CLiC2NEWS): ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నాగానీ అమ్మాయిలు ఏదో ఒకరకంగా బలిఅవుతూనే ఉన్నారు. తాజాగా గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో ఓ ప్రేమోన్మాది ప్రియురాలి గొంతుకోసి హతమార్చాడు. పెళ్లికి నిరాకరించిందని సర్జికల్ బ్లేడ్‌తో గొంతుకోసి తానూ గాయపరుచుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
వివరాలలోకి వెళితే.. విజయవాడలో ఓ మెడికల్ కాలేజీలో డిడిఎస్ మూడో సంవత్సరం చదువుతున్న తపస్వికి, ఉంగుటూరు మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌కు మధ్య ఇన్స్టాగ్రాం ద్వారం పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కొంతకాలం గన్నవరంలో ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా వారిద్దరి మధ్య విబేధాలు రావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయిన అతని నుండి ఇబ్బందులు రావడంతో స్నేహితురాలు వద్దకు వచ్చి చెప్పి బాధపడింది. స్నేహితురాలు ఆమెకు ధైర్యం చెప్పి అసలు వారిద్దరు మధ్య ఏంజరిగిందో తెలుసుకోవడానికి ఇద్దరినీ ఇంటికి పిలిచి మాట్లాడింది. ఆ మాటల సమయంలో తపస్వీ వేరే అతన్ని పెళ్లి చేసుకుంటా.. అని అనగానే కోపోద్రిక్తుడైన జ్ఞానేశ్వర్ సర్జికల్ బ్లేడ్‌తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మృతురాలు తల్లిదండ్రులు ముంబయిలో ఉంటున్నారు.