వైద్యశాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం వైద్యశాఖలో ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించనుంది. డిసెంబర్ 20వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 44 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈపోస్టులకు అర్హులు. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వైద్యశాఖలోని మొత్తం 34 విభాగాల్లో భర్తీ చేయనున్నారు.
అనస్థీషియా విభాగంలో 155 పోస్టుఉల, జనరల్ సర్జరీ విభాగంలో 117, జనరల్ మెడిసిన్ విభాగంలో 111 పోస్టుల అనాటమీ 26, ఫిజియాలజి 26, పాథాలజి-31, కమ్యూనిటి మెడిసన్ -23,మైక్రో బయాలజి -25, ఫొరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజి -25, బయో కెమిస్ట్రీ -20 ట్రాన్స్ ప్యూజన్ మెడిసన్ -14, పిడియాట్రిక్స్ -77, రేడయో డయాగ్నోసిస్-46, అంకాలజి-5, సైకియాట్రి – 23,
రెస్పిటరీ మెడిసిన్ -10, డెర్మటాలజి -13, గైనకాలజి-142, ఆప్తమాలజి -8, ఆర్థోపెడిక్స్ -62, ఇఎన్‌జి -15, హాస్పిటల్ ఆడ్మిన్ -14, మెడిసిన్ -15, కార్డియాలజి -17, కార్డియాక్ సర్జరీ -21, ఎండోక్రైనాలజి-12, గ్యాస్ట్రో ఎంట్రాలజి -14