ఎపి శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఈ శాఖలో ఖాళీగా ఉన్న 61 సిడిపిఓ (CDPO- Child Development Project Officer) పోస్టులను ఎపిపిఎస్‌సి ద్వారా భర్తీ చేయాలని సూచించారు. అంగన్‌వాడీలకు సార్టెక్స్ రైస్ సరఫరా చేయాలని, అదేవిధంగా న్యూట్రిషన్ కిట్ సరఫరాలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు.
Some truly nice stuff on this internet site, I love it.