ఇక నుండి సర్కార్ బడులలో సెమిస్టర్ విధానం..
![](https://clic2news.com/wp-content/uploads/2021/02/school-exams-copy-750x313.jpg)
అమరావతి (CLiC2NEWS): ఎపి ప్రభుత్వం పాఠశాల విద్యావిధానంలో కీలక నిర్ణయం తీసుకుంది. 1-9 తరగతి వరకు రెండు సెమిస్టర్ల విధానాన్ని తీసుకురానుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుండి ఈ విధానం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా పదో తరగతిలోనూ సెమిస్టర్ విధానం 2024-25 నుండి అమలులోకి రానుంది. వీటికి సంబంధించిన పుస్తకాలను కూడా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.