న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల అనుమతి తప్పనిసరి..
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/police-rules-for-new-year-celebrations.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నగరం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు పోలీసులు నిబంధలను విధించారు. న్యూ ఇయర్ వేడుకలను రాత్రి ఒంటిగంట వరకూ నిర్వహించాలనుకునే త్రీ స్టార్ హోటళ్లు, అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వాహకులు, యాజమాన్యాలు పది రోజుల ముందుగానే పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వేడుకలు నిర్వహించే ప్రాంగణంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ఉల, పార్కింగ్ ప్రదేశాలలోనూ సిసి కెమెరాలు అమర్చాలని సూచించారు. అసభ్యకర నృత్యాలు, అల్లర్లు, జరగకుండా చూడాలని, వేడులలో శబ్ధ తీవ్రత 45 డెసిబెల్స్ మించరాదని ఆదేశించారు.
వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలన్నారు. నిర్దిష్ట పరిమితికి మించి అనుమతులు, పాసులు జారీ చేస్తే చర్యలు తీసుకుంటామని నగర సిపి సివి ఆనంద్ హెచ్చరించారు. పబ్బుల్లో నిర్వహించే వేడుకలకు మైనర్లను అనుమతించకూడదన్నారు. మాదక ద్రవ్యాల సరఫరా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని అన్నారు. ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయం దాటిన తర్వాత మద్యం సరఫరా చేయకూడదని సూచించారు. వేడుకల అనంతరం మద్యం సేవించిన వారు వాహనం నడపకూడదని.. వారు తమ ఇళ్లకు చేరే బాధ్యత యాజమాన్యాలదేనని తెలిపారు. అంతేకాకుండా సాధారణ ట్రాఫిక్‌కు ఎటువంటి ఆటంకం కలగకుడదని పేర్కొన్నారు.
Você pode ser mais específico sobre o conteúdo do seu artigo? Depois de lê-lo, ainda tenho algumas dúvidas. Espero que possa me ajudar.