‘వాల్తేరు వీర‌య్య’ చిత్రంలోని సెకండ్‌ సాంగ్ వ‌చ్చేసింది.

హైద‌రాబాద్ (CLiC2NEWS): చిరంజీవి, శ్ర‌తిహాస‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం వాల్తేరు వీర‌య్య‌. ఈ చిత్రం నుండి ‘నువ్వు సీతవైతే.. నేను రాముడినంట’ అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్ విడుద‌లైంది. ఈ మెలోడియ‌స్ సాంగ్‌లో చిరు, శ్ర‌తిహాస‌న్ స్టెప్పులు ఆక‌ట్టుకుంటున్నాయి.ఈ పాటకు లిరిక్స్‌, సంగీతం దేవీశ్రీ‌ప్ర‌సాద్ అందించారు. ఈ చిత్రంలో ర‌వితేజ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా జ‌న‌వ‌రి 13వ తేదీన సంక్రాంతి కానుక‌గా విడుదల‌కానుంది.

Leave A Reply

Your email address will not be published.