తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు..
మార్చి 15 నుండి ఎగ్జామ్స్ షురూ..
![](https://clic2news.com/wp-content/uploads/2021/02/TS-inter-borad-copy-750x313.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం ప్రకటించారు. ఫిబ్రవరి 15 నుండి మార్చి 2వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరపాలని అధికారల నిర్ణయించారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను మార్చి 4న, ఎన్నిరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎక్జామ్ మార్చి 6న నిర్వహిస్తారు.