ప్రమాదవశాత్తు నీట మునిగిన థాయ్ యుద్ధనౌక.. 31 మంది గల్లంతు
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/warship-at-gulf-fo-thailand.jpg)
బ్యాంకాక్ (CLiC2NEWS): సముద్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ భారీ యుద్ధనౌక నీట మునిగింది. ప్రమాదంలో 31 మంది గల్లంతయ్యారు. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో భారీ థాయ్ యుద్ధ నౌక (హెచ్టిఎంస్ సుఖొథాయ్) లోకి నీరు చేరడంతో సముద్రంలో మునిగిపోయింది. సుఖొథాయ్ సముద్రతీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఆదివారం సాయంత్రం గస్తీ విధులు నిర్వహిస్తుండగా.. ఆ సమయంలో బలమైన ఈదురుగాలుల కారణంగా సముద్రపు నీరు నౌకలోకి చేరింది. సమాచారం అందుకున్న థాయ్ నౌకాదళం.. సహాయక సిబ్బందిని పంపింది. కానీ వారు చేరుకునే సరికి బలమైన గాలులు కారణంగా నౌకలోని నీటిని బయటకు పంపటం సాధ్యంకాలేదు. ఇంజన్ వ్యవస్థ దెబ్బతిని పనిచేయలేదు. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయి మరింత నీరు నౌకలోకి చేరి.. నౌకా నెమ్మదిగా ఒరిగిపోతూ నీటమునిపోయింది. ఈ ప్రమాద సమయంలో నౌకలో 106 మంది నేవీ సిబ్బంది ఉన్నారు. వీరిలో 75 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. మిగిలిన 31 మంది ఆచూకీ కోసం హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.