సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. రిజర్వేషన్‌పై 10% రాయితీ
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/rtc-bus.jpg)
అమరావతి (CLiC2NEWS): సంక్రాంతికి పండగకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఎపియస్ ఆర్‌టిసి శుభవార్త తెలిపింది. సంక్రాంతి కోసం 6,400 అధనపు బస్సులు నడపనున్నారు. అంతేకాకుండా ఎటువంటి అధనపు ఛార్జీలు ఉండవని.. సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడపుతామని ఆర్టిసి ఎండి తిరుమలరావు తెలిపారు. ఈ బస్సులలో అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకుంటే 10శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.