’18 పేజెస్’ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్: అనుప‌మ‌తో అల్లు అర‌వింద్, సుకుమార్ స్టెప్పులు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): నిర్మాత అల్లుఅర‌వింద్, ద‌ర్శ‌కుడు సుకుమార్, హీరోయిన్ అనుప‌మ‌తో క‌లిసి డ్యాన్స్ చేశారు. అనుప‌మ‌ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, నిఖిల్ జంట‌గా న‌టించిన చిత్రం 18 పేజెస్ విడుద‌లై మంచి స‌క్సెస్ టాక్‌ని అందుకుంది. దీంతో చిత్ర‌బృందం విజ‌యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చిత్ర‌బృందం ఏర్పాటు చేసిన పార్టీలో కాథానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో క‌లిసి నిర్మాత అల్లు అర‌వింద్‌, ద‌ర్శ‌కుడు సుకుమార్ స్టెప్పులేసి అల‌రించారు. దీనికి సంబంధించిన వీడియో స‌మాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Leave A Reply

Your email address will not be published.