నేపాల్ నూతన ప్రధానిగా ప్రచండ ప్రమాణం..
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/nepal-new-pm.jpg)
ఖాట్మండు (CLiC2NEWS): నేపాల్ నూతన ప్రధానిగా పుష్పకమల్ దహాల్ ప్రచండ ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ ప్రతినిధుల సభకు గత నెలలో ఎన్నికలు జరిగాయి. ప్రచండ మూడోసారి నేపాల్ ప్రధాని పీఠం అధిష్టించారు. 2008లో మొదటిసారి ప్రధానిగా ఎన్నికైనారు. రెండవసారి 2016,
నేపాల్ కొత్త ప్రధానిగా నియమితులైన ప్రచండకు భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
ఏ ఒక్కపార్టీకి సరైన మెజార్టి రాకపోవడంతో..నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్-ఎంసి, మరో మూడు పార్టీలతో కూడిన అధికార కూటమి తమ సంకీర్ణ ప్రభుత్వంను కొనసాగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. రొటేషన్ పద్దతిలో మొదటి రెండున్నరేండ్లు ఇప్పటి వరకు ప్రధానిగా కొనసాగిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్‌బా ఉన్న ప్రధానిగా ఉండాలి. కానీ.. తొలి విడతలో తనను ప్రధానిగా చేయాలని ప్రచండ పట్టుబట్టడంతో దేవ్‌బా అంగీకరించలేదు. దీంతో సంకీర్ణ కూటమి కూలి పోయింది. దీంతో ప్రచండ ప్రత్యామ్నాయ వ్యూహాన్ని అమలు చేశారు.