అర్ధరాత్రి ఇంట్లో మంటలు వ్యాపించి ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవదహనం

లఖ్‌నవూ (CLiC2NEWS): ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలోని ఓ ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి ఇంట్లో మంటలు వ్యాపించి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మైనర్లుకూడా ఉన్నట్లు సమాచారం. యుపిలోని మౌజిల్లాలోని షాపుర్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ స్టవ్ నుండి మంటలు అంటుకుని ప్రమాదానికి కారణమైనట్లు అధికారులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు