కందుకూరు టిడిపి స‌భ‌లో అప‌శృతి.. ఏడుగురు కార్య‌క‌ర్తలు మృతి

నెల్లూరు (CLiC2NEWS): జిల్లాలోని కందుకూరులో నిర్వ‌హించిన టిడిపి స‌భ‌లో అప‌శృతి చోటు చేసుకుంది. టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు పాల్గొన్న స‌భ‌కు భారీగా కార్య‌క‌ర్త‌లు రావ‌డంతో తోపులాట జ‌రిగి కొంద‌రు కార్య‌క‌ర్త‌లు డైనేజిలో పడిపోయారు. ఈ ప్ర‌మాదంలో కొంత‌మంది గాయ‌ప‌డ్డారు. టిడిపి నేత‌లు వారిని ఆస్ప‌త్రికి త‌రలించగా.. చికిత్స‌పొందుతూ ఏడుగురు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. దీంతో చంద్ర‌బాబు నాయ‌డు ప్ర‌సంగం ఆపేసి ఆస్ప‌త్రికి వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం త‌న‌ను క‌ల‌చివేసింద‌ని, అమాయ‌కులు చ‌నిపోవ‌డం బాధ క‌లిగిస్తుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. మృతుల కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బాధిత కుటుంబాల‌ను అన్ని విధాలా పార్టీ ఆదుకుంటుంద‌ని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.