కందుకూరు ఘటన.. మృతుల కుటుంబాలకు రూ. 23 లక్షల చొప్పున ఆర్ధికసాయం
హైదరాబాద్ (CLiC2NEWS): కందుకూరు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 23లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం పార్టీ తరపున మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల ఆర్ధికసాయం ప్రకటించారు. తాజాగా ఆ మొత్తాన్ని రూ. 23లక్షలకు పెంచారు. పార్టీలో పలువురు నేతలు సైతం సహాయం చేసేందుకు ముందుకు రావడంతో ఈ మొత్తాన్ని ప్రకటించారు. నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన టిడిపి సభలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది టిడిపి కార్యకర్తలు మృతి చెందారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్పత్రిలోని బాధితులను పరామర్శించి వారికి పరిహారం ప్రకటించిన విషయం తెలిసినదే.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ ..
కందుకూరు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల ఎక్స్‌గ్రేషియా ప్రధాని మోడీ ప్రకటించారు.