న‌కిలీ స‌ర్టిఫికెట్‌ల‌తో వైద్యులుగా న‌మోదు.. 73 మందిపై సిబిఐ వేటు

ఢిల్లీ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్రాల్లో న‌కిలీ ధ్ర‌వ‌ప‌త్రాల‌తో వైద్యులుగా త‌మ పేర్లను న‌మోదు చేసుకున్న 73 మంది న‌కిలీ వైద్య విద్యార్థుల‌పై సిబిఐ కేసు న‌మోదు చేసింది. వీరికి స‌హ‌క‌రించిన వారిపై కూడా ఎఫ్ ఐఆర్ నమోదు చేసింది. విదేశాల్లో వైద్య విద్య‌ను అభ్య‌సించిన విద్యార్థులు భార‌త్‌లో ప్రాక్టీస్ చేయాలంటే ఫారిన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ ఎమ్‌జిఇ) ఉత్తీర్ణ‌త సాధించాలి. ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వారి వివ‌రాలు జాతీయ వైద్య మండ‌లి (ఎంసిఐ) లేదా రాష్ట్ర వైద్య మండ‌లి (ఎస్ఎమ్‌సి) లో ప్రొవిజ‌న‌ల్‌గా, శాశ్వతంగా న‌మోదు చేస్తారు. కానీ.. కొంద‌రు విద్యార్థులు అర్హ‌త ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించ‌క‌పోయినా న‌కిలీ ధ్ర‌వ‌ప‌త్రాలతో వైద్యులుగా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లోని 91 స్థావ‌రాలపై సిబిఐ దాడులు నిర్వ‌హించింది. వీరిలో ఎపి, తెలంగాణ‌తో స‌హా 15 రాష్ట్రాల్లోని వైద్య మండ‌ళ్ల అధికారులు కూడా కొంద‌రు ఆన్నారు.

Leave A Reply

Your email address will not be published.