బిఆర్ఎస్లో చేరిన ఎపి నేతలు తొట చంద్రశేఖర్, రావెల కిషోర్
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/BRS-joinings.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పలువురు సీనియర్ నాయకులు భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో బీఆర్ ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సిఎం కెసిఆర్ వీరికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. బిఆర్ ఎస్‌లో చేరిన వారిలో మాజీ ఐపిఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, మాజీ ఐఆర్ ఎస్ అధికారి పార్థసారథి తదితర నాయకులు ఇవాళ కెసిఆర్ సమక్షంలో పార్టీ లో చేరారు. వీరితో పాటు అనంతపురానిక చంఎదిన టిజె ప్రకాశ్, కాపునాడు ప్రధాన కార్యదర్శి గిద్దల శ్రీనివాస్ నాయుడు, ఎపి ప్రజాసంఘాల జెఎసి అధ్యక్షుడు రామారావు తదితరులు బిఆర్ ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు ఉన్నారు.