సిద్దిపేటలో వెంకటేశ్వర స్వామికి స్వర్ణ కిరీటం
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/Siddipet-sworn-crown.jpg)
సిద్దిపేట (CLiC2NEWS): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి కి తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. సోమవారం మంత్రి స్వామి వారిని సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి 1.792 కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించి మొక్కును తీర్చుకున్నారు. అనంతరం మంత్రి హరీష్‌రావుకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పణ. pic.twitter.com/bMNUleAb8e
— Harish Rao Thanneeru (@trsharish) January 2, 2023