ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులకు బెయిలు
ఢిల్లీ (CLiC2NEWS): డిల్లీ మద్యం కేసులో రౌస్ ఆవెన్యూ కోర్టు నిందితులకు బెయిలు మంజూరు చేసింది. ఎక్సైజ్ శాఖ మాజీ ఉద్యోగులైన కుల్దీప్సింగ్, నరేందర్సింగ్ తో పాటు ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. వీరిపై సిబిఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీటుపై విచారణ సందర్భంగా కోర్టు వారికి మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. బెయిలు మంజూరు సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక్కొక్కరికి రూ. 50 వేల పూచీకత్తుపై వారికి బెయిలు మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.