కొత్త సంవత్సరం.. బొగ్గుగని కార్మికులకు శుభవార్త..!
గోదావరిఖని (CLiC2NEWS): కొత్త సంవత్సరంలో బొగ్గగని కార్మికులకు 19శాతం వేతనాలు పెంచడానికి వేజ్బోర్డ్ అంగీకరించింది. మొదట 4 (ఎఐటియుసి, సిఐటియు, బిఎంఎస్, హెచ్ ఎం ఎస్ ) కార్మిక సంఘాలు 28 % ఎంజిబి చెల్లించాలని డిమాండ్ చేశారు. కాని బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం 19% శాతం పెదుగుదలతో ఖరారైంది. ఈ నాలుగు సంఘాలలో హెచ్ ఎంఎస్ మాత్రం 28 % నుండి దిగివచ్చి.. 20% ఇవ్వాలని పట్టబట్టింది. కానీ కోల్ ఇండియా యాజమాన్యం 12% నుండి పెంచుకుంటూ వచ్చి 19% అంగీకరించింది.
పెరిగిన వేతనాల ప్రకారం మొదటి క్యాటగిరీ కార్మికుడికి రూ. 6,973.73 పెరుగుదల ఉంటుందని తెలుస్తొంది. 10వ వేతన ఒప్పందం ప్రకారం మొదటి క్యాటగిరీ కార్మికుడికి రూ. 4,800 పొందగా.. 11వ ఒప్పందం ప్రకారం దాదాపు రూ.7 వేల వరకు ఉంటుందని సమాచారం.