నేటి నుండి ఎపికి టిఎస్ఆర్టీసి స్లీపర్ బస్సులు ప్రారంభం..
హైదరాబాద్ (CLiC2NEWS): నేటి నుండి టిఎస్ ఆర్టిసి మొదటిసారిగా 10 స్లీపర్ బస్సులు నడపనుంది. బుధవారం సాయంత్రం టిఎస్ ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండి సజ్జనార్ వీటిని ప్రారంభించారు. ఈ 10 స్లీపర్ బస్సులలో 4 మాత్రం పూర్తిగా స్లీపర్ బస్సులు కాగా.. 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. ఇవి హైదరాబాద్ నుండి కాకినాడ, హైదరాబాద్ నుండి విజయవాడకు మధ్య ప్రయాణిస్తాయి.
విజయవాడకు వెళ్లే బస్సులు హైదరాబాద్ మియాపూర్ నుండి ప్రతిరోజూ ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలు దేరతాయి. మళ్లీ విజయవాడ నుండి ఉదయం 10.15, 11.15 మధ్యాహ్నం 12.15 గంటలకు.. అదేవిధంగా అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు తిరిగి బయలుదేరతాయి.
అదేవిధంగా కాకినాడకు వెళ్లే బస్సులు హైదరాబాద్ బిహెచ్ ఇఎల్ నుండి ప్రతిరోజూ రాత్రి 7.45, 8.30 గంటల్ఎ బయలుదేరతాయి. తిరిగి కాకినాడ నుండి హైదరాబాద్కు రాత్రి 7.15, 7.45 గంటలకు బయలుదేరతాయి.