జోషిమ‌ఠ్ ప‌ట్ట‌ణంలో భూమి కుంగిపోతుంది.. 561 ఇళ్లకు పైగా ప‌గుళ్లు..

జోషిమ‌ఠ్ (CLiC2NEWS): ఉత్త‌రాఖండ్‌లోని జోషిమ‌ఠ్ ప‌ట్ట‌ణంలో కొద్దిరోజుల నుండి భూమి కుంగిపోతుంది. ఇళ్లలో ప‌గుళ్లు ఏర్పడుతున్నాయి. స‌మారు 600 ఇళ్ల‌కు పగుళ్లు రావ‌డంతో ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కొంత మంది ప్ర‌జ‌లు త‌మ ఇళ్ల‌ను వ‌దిలేసి వెళ్లిపోయిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. అక్క‌డి ప్ర‌జ‌లు అధికారుల‌కు విన్న‌వించుకున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోతున్నారు. ప‌వ‌ర్ ప్రాజెక్టు వ‌ల‌నే ఈ స‌మ‌స్య త‌లెత్తింద‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. త‌మ ఇళ్లు బీట‌లు రావ‌డానికి కార‌ణ‌మైన ఎన్‌టిపిసి ట‌న్నెల్‌, హేలంగ్‌-మార్వాడీ బైపాస్ రోడ్డు నిర్మాణాల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని డిమాండు చేస్తున్నారు.

జోషిమ‌ఠ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లు బీట‌లు వారిన‌ట్లు గుర్తించామ‌ని జిల్లా విప‌త్తు నిర్వ‌హ‌ణ అధికారి వెల్ల‌డించారు. అక్క‌డ‌క్క‌డ కింది నుండి నీళ్లు ఉబికి వ‌స్తున్నాయ‌ని గుర్తించిన‌ట్లు స‌మాచారం. ఐఐటి రూర్కీతో పాటు ప‌లు నిపుణుల సంస్థ‌లు ఘ‌ట‌నా స్థాల‌న్ని ప‌రిశీలిస్తున్నారు. బీటలు వార‌డానికి గ‌ల కార‌ణాల‌ను అన్వేషిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.