TSPSC: ఎఇఇ ఉద్యోగ నియామక పరీక్ష వాయిదా..
హైదరాబాద్ (CLiC2NEWS): ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహించాల్సిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (ఎఇఇ) పోస్టుల నియామకానికి నిర్వహించే పరీక్షను వాయిదా వేసినట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. అదే రోజు గేట్ ఎక్జామ్ ఉండటంతో ఎఇఇ పరీక్షను వాయిదా వేసినట్లు తెలిపింది. తిరిగి మార్చి 5వ తేదీన ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు మొత్తం 837 ఉండగా.. 74,488 యంది దరఖాస్తు చేసుకున్నారు.