ఖమ్మం జిల్లా నేతలతో సిఎం కెసిఆర్ సమావేశం
హైదరాబాద్ (CLiC2NEWS): ఈనెల 18వ తేదీన బిఆర్ ఎస్ ఆవిర్భావ బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ప్రగతిభవన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సిఎం సమావేశమయ్యారు. బిఆర్ ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లకు సంబంధించి నేతలతో సిఎం చర్చించినట్లు సమాచారం. ఈ సభకు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్, యూపి మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్, కేరళ సిఎం పినరాయి విజయన్‌లను ఆహ్వానించారు. జనవరి 18న ఖమ్మంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను సిఎం ప్రారంభించనున్నారు. అదేరోజు ఖమ్మంలో 100 ఎకరాల మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూడానలి ఆదేశాలు జారీ చేశారు. ఈ సభ ద్వారా దేశ రైతాంగానికి, రాజకీయ పక్షలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.