సిద్దిపేట జిల్లాలో ప్రమాదానికి గురైన కారు.. ఐదుగురు మృతి
సిద్దిపేట (CLiC2NEWS): జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జగదేవ్పూర్ మునిగడప గ్రామానికి సమీపంలో కారు అదుపుత్పి గుంతలో పడిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరోకరు మృతిచెందారు. పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.