అంధత్వ రహిత తెలంగాణ కోసం ‘కంటి వెలుగు’: మంత్రి తలసాని
![](https://clic2news.com/wp-content/uploads/2022/07/talasani.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): జనవరి 18వ తేదీ నుండి కంటి వెలుగు రెండవ దశ కార్యక్రమం ప్రారంభం కానుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హోంమంత్రి మహమూద్ ఆలీతో కలిసి జిహెచ్ ఎంసి కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 250 కోట్ల ఖర్చు చేస్తుందన్నారు. జిహెచ్ ఎంసి పరిధిలోని 91 వార్డులలో 115 శిబిరాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మంత్రి అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో నమోదయ్యే విధంగా రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.