తెలంగాణ ప్ర‌భుత్వ నూత‌న సిఎస్‌గా శాంతికుమారి

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర నూత‌న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శాంతికుమారి నియ‌మితుల‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న సోమేశ్‌కుమార్ ఎపికి కేటాయిస్తూ.. కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనిని హైకోర్టు స‌మ‌ర్థించింది. దీంతో శాంతికుమారి తెలంగాణ రాష్ట్ర సిఎస్‌గా నియ‌మితులయ్యారు. అనంత‌రం ఆమె ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కెసిఆర్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కెసిఆర్ శాంతికుమారికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

శాంతికుమారి గ‌త మూడు ద‌శాబ్ధాలుగా ఐఎఎస్‌గా విద్య‌, వైద్య ఆరోగ్య రంగాలు, అట‌వీశాఖ‌ల్లో, పేద‌రిక నిర్మూల‌న స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్‌ల‌లో వివిధ హోదాల్లో సేవ‌లందించారు. కెసిఆర్ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో మెద‌క్ క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. సిఎం కార్యాల‌యంలో ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా, టిఎస్ ఐపాస్‌లో ఇండ‌స్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీగా కూడా సేవ‌లందించారు.

Leave A Reply

Your email address will not be published.