WHO: రెండు ర‌కాల ద‌గ్గు మందుల‌ను చిన్నారుల‌కు వాడొద్దు..

జెనీవా (CLiC2NEWS): మ‌రియ‌న్ బ‌యోట‌క్ సంస్థ త‌యారు చేసిన రెండు ర‌కాల కాఫ్ సిర‌ప్‌ల‌ను చిన్నారుల‌కు వాడొద్ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించింది. భార‌త్‌లోని నొయిడాకు చెందిన మ‌రియ‌న్ బ‌యోటిక్ సంస్థ త‌యారు చేసిన అబ్రోనాల్‌, డాక్‌-1మ్యాక్స్ ద‌గ్గు మందుల‌ను ఉజ్బెకిస్థాన్‌లోని చిన్నారుల‌కు వాడొద్ద‌ని సూచించింది. ఈ మందుల‌లో ప‌రిమితికి మించి డై ఇథిలిన్ గ్లైకాల్‌, ఇథిలిల్ ఉన్నాయ‌ని, ఈ మందులు నాసిర‌క‌మైన‌వ‌ని.. నాణ్య‌తా ప్ర‌మాణాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌య్యాయని WHO  ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

ఉజ్బెకిస్థాన్‌లో చిన్నారులు భార‌త్‌లో త‌యారైన దగ్గు మందు వాడ‌టం వ‌ల‌న మృతి చెందార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నందున ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. మ‌రియ‌న్ బ‌యోటిక్ కంపెనీ త‌యారు చేసిన డాక్‌-1 మాక్స్ ద‌గ్గుమందు తాగిన పిల్ల‌లు ఇటీవ‌ల 18 మంది తీవ్ర శ్వాస‌కోశ ఇబ్బందుల‌తో మ‌ర‌ణించిన‌ట్లు ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ ఘ‌ట‌న అనంత‌రం హ‌రియాణాలోని సొనెప‌ట్ కేంద్రంగా ప‌నిచేసే మైడెన్ ఫార్మా సంస్థ త‌యారు చేసిన సిర‌ప్‌ల‌ను వాడ‌టం వ‌న‌ల గాంబియా దేశంలో 66 మంది చిన్నారులు మృతి చెందారు.

Leave A Reply

Your email address will not be published.