మ‌హ‌బూబాబాద్‌, కొత్త‌గూడెం క‌లెక్ట‌రేట్‌ల‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

మ‌హ‌బూబాబాద్ (CLiC2NEWS): మహ‌బూబాబాద్‌లో బిఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని, స‌మీకృత జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్రారంభించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో సిఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాడిన త‌ర్వాత అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నామ‌న్నారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కొత్త‌గా క‌లెక్ట‌రూట్‌లు నిర్మించుకున్న‌ట్లు వివ‌రించారు. ఉద్య‌మ స‌మ‌యంలో ఎన్నోసార్లు మ‌హ‌బూబాబాద్ వ‌చ్చాన‌ని.. అప్ప‌డు ఈ ప్రాంతం బాగా క‌ర‌వు ఉండేద‌ని గుర్తు చేశారు. జిల్లాకు కొత్త‌గా ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామ‌ని కెసిఆర్ హామీ ఇచ్చారు. మ‌హ‌బూబాబాద్ నుండి కొత్త‌గూడెం చేరుకున్న సిఎం నూత‌నంగా నిర్మించిన క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.