IND vs SL: రెండో వన్డేలో భారత్ విజయం.. 2-0తో సిరీస్ కైవసం
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/IND-VS-SL.jpg)
కోల్‌కతా (CLiC2NEWS): భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండవ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 215 పరుగులు చేసి ఆలౌటయింది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 43.2 ఓవర్లో ఛేదించింది. ఈ గెలుపుతో మూడు వన్డే సిరిస్ మ్యాచ్‌ని భారత్ 2-0 తేడాతో మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. తొలి వన్డేలో రాణించిన విరాట్ 4, రోహిత్ 17, శుభ్‌మన్ గిల్ 21 ఈ మ్యాచ్‌లో నిరాశ పరిచారు. రాహుల్ 64, హార్దిక్ పాండ్య 36, శ్రేయస్ అయ్యర్ 28. అక్షర్ పటేల్ 21 పరుగులు చేశారు.