జోషిమ‌ఠ్‌లో నేల కుంగుతూనే ఉంది.. వేరే ప్రాంతానికి సైన్యం త‌ర‌లింపు

ఢిల్లీ (CLiC2NEWS): జోషిమ‌ఠ్‌లో ఇళ్లు బీట‌లు వార‌డం, నేల కుంగిపోవ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. తాజాగా ఇపుడు ఆర్మీ భ‌వ‌నాలకు బీటలు వ‌స్తున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన భార‌త సైన్యం త‌మ బ‌ల‌గాల‌ను మ‌రో ప్రాంతానికి త‌ర‌లించింది. ఈ విష‌యాన్ని ఆర్మీ ఛీఫ్ మ‌నోజ్ పాండే వెల్ల‌డించారు. అవ‌స‌ర‌మైతే మ‌రింత మందిన త‌ర‌లించేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు చెప్పారు. దీనివ‌ల‌న త‌మ సంసిద్ధ‌త‌పై ఎలాంటి ప్ర‌భావ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితి ప్ర‌స్తుతం ప్ర‌శాంతంగానే ఉంద‌ని మ‌నోజ్ పాండే వివ‌రించారు. ఎలాంటి ప‌రిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌మ‌న్నారు. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద చైనా ద‌ళాల క‌ద‌లిక‌లు ఉన్నాయ‌ని.. ఇరుదేశాల మ‌ధ్య య‌థాత‌థ స్థితిని కొన‌సాగించేందుకు మిల‌ట‌రీ, దౌత్య స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. మ‌రోవైపు జోషిమ‌ఠ్‌లోని ప‌రిస్థితుల‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు.

జోషిమ‌ఠ్ ప‌ట్ట‌ణంలో భూమి కుంగిపోతుంది.. 561 ఇళ్లకు పైగా ప‌గుళ్లు..

Leave A Reply

Your email address will not be published.