ఎస్ ఐ, కానిస్టేబుల్ తుది పరీక్షల తేదీల్లో మార్పులు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామక తుది రాత పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. ఎస్ ఐ, ఎఎస్ ఐ, కానిస్టేబుల్ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరీక్షల సమయంలో ఇతర పరీక్షలు ఉన్నందున తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన విజ్ఞప్తి మేరకు తేదీల్లో మార్పులు చేసినట్లు సమాచారం.
ఏప్రిల్ 23వ తేదీన జరగవల్సిన కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటి విభాగం) రాత పరీక్షలను 30వ తేదీకి మార్చారు. ఎస్ ఐ(ఐటి), ఎస్ ఐ)(ఫింగర్ ప్రింట్స్) పరీక్ష తేదీని మార్చి 12 వ తేదీ నుండి 11వ తేదీకి మార్చినట్లు టిఎస్‌పిఎల్ ఆర్ బి వెల్లడించింది.