TS: నూతన సచివాలయ ప్రారంభ తేదీ ఖరారు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/new-secreteriat.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. వచ్చే నెల (ఫిబ్రవరి) 17న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చేనెల 17న సిఎం కెసిఆర్ పుట్టిన రోజున సచివాలయాన్ని సిఎం ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. కాగా తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన విషయం తెలిసిందే.