AP: రాష్ట్రంలో పర్యాటకరంగాభివృద్ధికి కృషి: మంత్రి రోజా
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/roja-playing-kolatam.jpg)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక మంత్రి రోజా పేర్కొన్నారు. భవని ద్వీపంలో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఇక్క డ జరిగిన ఉత్సవాల్లో కోలాటం ఆడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక్కడికి వస్తే సొంత గ్రామానికి వచ్చినట్లు ఉంటుందన్నారు. పర్యాటక శాఖ ఆధ్వరంలో భవానీ ద్వీపంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. విజయవాడ, వైజాగ్, తిరుపతిలో పర్యాటక అభివృద్ధికి పత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.