నేపాల్‌లో కుప్పకూలిన 72 మంది ప్రయాణికులున్న విమానం
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/PLANE-CRASH-IN-NEPAL.jpg)
ఖాట్మండు (CLiC2NEWS): నేపాల్లోని పొఖారా నగరంలో ఆదివారం యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. దీనిలో ప్రమాణిస్తున్న 72 మందిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. వీరిలో భారత్‌కు చెందినవారు ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారుగా గుర్తించారు. ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో బయలుదేరిన విమానం సేతి నది లోయలో కూలిపోయింది. ఈ విమానంకు సంబంధించిన బ్లాక్‌బాక్స్ సోమవారం లభ్యమయ్యింది. ప్రామాదం జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే ఇది దొరికింది. ఈ విమానంలో ఉన్న 72 మంది ప్రమాణికులలో 69 మంది భౌతికకాయాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.