ఖమ్మంలో రేపు బిఆర్ఎస్ ఆవిర్భావ సభ
హైదరాబాద్ (CLiC2NEWS): రేపు బిఆర్ఎస్ ఆవిర్భావ సభను ఖమ్మం నగరంలో నిర్వహించేందకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసినదే. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఈ సభా వేదికలో 4 జాతీయ పార్టీల నేతలు, నలుగురు ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఈ రోజు రాత్రికల్లా వారంతా హైదరాబాద్ చేరుకుంటారు. వీరంతా బుధవారం సిఎం కెసిఆర్‌తో కలిసి ఉదయం అల్పాహారం చేయనున్నారు. దేశ రాజకీయలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం యాదాద్రీశుడి దర్శనానికి వెళ్లనున్నారు. అక్కడి నుండి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లలో ఖమ్మంకు వెళతారు.
ముఖ్యమంత్రి కెసిఆర్‌తో కలిసి జాతీయ నాయకులు ఖమ్మం కలెక్టరేట్ చేరుకుని.. కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.
ఖమ్మంలో నిర్వహించే తొలి ఆవిర్భావ బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.