ఉప్పలో స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్: సిపి చౌహాన్ సూచనలు
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/CP-CHOUHAN.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో రేపు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనున్న విషయం తెలిసినదే, ఈ సందర్భంగా 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు కల్పించినట్లు రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. క్రీడాభిమానులు మైదానంలోకి సెల్ఫోన్లు మాత్రమే తీసుకురావాలని.. మరేదీ అనుమతించమని పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులు మైదానంలోకి వెళ్లి క్రికెటర్లకు అడ్డుపడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం 40 మంది షి టీం బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్, బ్లాక్ టికెట్లపైన ఎస్ఒటి, స్థానిక పోలీసులు దృష్టి సారించినట్లు సిపి పేర్కొన్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు ప్రేక్షకులు తొందరపడొద్దని సూచించారు.
This is my first time pay a quick visit at here and i am genuinely happy to read all at one place.
Thank you for any other excellent post. The place else could amyone get that type of information iin such
a perfect measns of writing? I’ve a presentation subsequent week,
and I’m on the look for such info.
I think the admin of this site is actually working hard for
his site, since here every material is quality based material.