హైదరాబాద్‌లో రెండవ ఇన్నోవేషన్ సెంటర్..దావోస్ వేదికగా ఒప్పందం
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/digital-innovation-center-in-hyd.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆపోలో టైర్స్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. లండన్ తర్వాత నగరంలో ఏర్పాటు చేసేది రెండవ ఇన్నోవేషన్ సెంటర్. డిజిటల్ వ్యూహాలైప ఐఒటి, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోఇక్ ప్రాసెస్ ఆటోమేషన్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికలతను ఉపయోగించి.. నూతన వ్యాపార నమూనాలను అభివృద్ది చేయనున్నారు. వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కెటిఆర్ దావోస్ పర్యటనలో భాగంగా ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి కెటిఆర్ సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అపోలో టైర్స్ లిమిటెడ్ విసి, ఎండి నీరజ్ కన్వర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్కెటింగ్, తయారీ సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు కంపెనీ సప్లై ఛూన్‌ను మరింత సమర్థంగా వినియోగించుకుని అనుకొన్న లక్ష్యాలను సాధించడం కోసం టిజిటలైజేషన్ ఎంతో కీలకమని.. లండన్ తరువాత హైదరాబాద్‌లో ఈ సెంటర్ ఏర్పాటు చేయడం సంస్థ డిజిటల్ వ్యూహంలో భాగమని వివరించారు.