IND vs NZ: ఉత్కంఠ పోరులో టీమ్ ఇండియా విజయం
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/IND-VS-NZ-1.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 350 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కానీ మైఖేల్, శాంటర్న్‌లు రాణించి టీమ్ ఇండియాకు గట్టి పోటీనిచ్చారు. మైఖేల్ బ్రేస్‌వెల్ 60 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో టీమ్ ఇండియాకు చెమటలు పట్టించాడు. 49.2 ఓవర్లలో 337 పరుగులు చేసి ఆలౌటయింది.
టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 349 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారత్ బ్యాట్స్‌మెన్‌లలో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేసి రికార్డులు సృష్టించాడు. కోహ్లీ 8, ఇషాన్ కిషన్ 5 పరుగులతో వెనుతిరగగా.. రోహిత్ శర్మ 34, సూర్యకుమార్ 31, హార్దిక్ పాండ్య 28, వాషింగ్టన్ సుంరద్ 12, శార్దూల్ ఠాకూర్ 3 పరుగులు చేశారు. కుల్దీప్ 5*, షమి 2*పరుగురలు చేసి నాటౌట్గా నిలిచారు.