సికింద్రాబాద్‌లోని షాపింగ్‌మాల్ అగ్నిప్రమాదం.. ముగ్గురు గల్లంతు

హైదరాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్‌లోని షాపింగ్ మాల్‌లో గురువారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసినదే. ఈ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మరో ముగ్గురు ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. బిహార్‌కు చెందిన కూలీలు జునైధ్, వసీం, జహీర్‌గా గుర్తించారు. వీరి సెల్‌ఫోన్ లొకేషన్ మంటుల చెలరేగిన భవనంలోనే చూపిస్తుండటంతో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకటి కాదు, రెండుకాదు.. ఏకంగా 22 ఫైర్ ఇంజన్లతో మంటలు పూర్తిగా ఆర్పినా బిల్డింగ్‌లో వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మాల్‌లోకి వెళ్లటం కష్టంగా మారింది. డ్రోన్ కెమెరా ద్వారా సెర్చ్ చేస్తుండగా రెండో అంతస్తులో రెండు మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం. దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.