మ‌సీదులో పేలుడు సంభ‌వించి 44 మంది మృతి..

ఇస్లామాబాద్ (CLiC2NEWS): పాకిస్థాన్‌లోని ఓ మ‌సీదులో బాంబు పేలి ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 44 మంది మృతి చెందిన‌ట్లు స‌మాచారం. 157 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పెషావ‌ర్‌లోని ఓ మ‌సీదులో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ప్రార్థ‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ పేలుడు జ‌రిగింది. మ‌సీదులో 250 నుండి 300 మంది ప‌ట్టే మ‌సీదులో బాంబు పేల‌డంతో పైక‌ప్పు కూలిపోయింది. సుమారు 300 మంది పోలీసులు పేలుడు జ‌రిగే స‌మ‌యంలో అక్క‌డే ఉండ‌టం గ‌మ‌నార్హం.

గ‌త సంవ‌త్సరంలో కూడా పెషావ‌ర్‌లో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. షియా మ‌సీదులో ఆత్మాహుతి దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 63 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో అధికారులు రోడ్ల‌ను మూసివేసి, రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your email address will not be published.