టర్కీ, సిరియ దేశాల్లో భారీ భూకంపం.. 1600 కు చేరిన మృతులు

అంకారా (CLiC2NEWS): ఆ రెండు దేశాలలో ప్రకృతి అల్లకల్లోలం సృష్టించింది. 7.8 తీవ్రతతో భూమి కంపించడంతో వందలాది భవనాలు నేలకొరిగాయి. అనేక మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తుర్కియో, సిరియా దేశాల్లో చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8గా నమోదైందని యుఎస్ఎ జియాజికల్ సర్వే తెలిపింది. గంటల వ్యవధిలోని 20 సార్లు భూప్రకంపనలు రావడంతో ప్రమాద స్థాయి తీవ్రంగా ఉందని అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సిరియాలో దాదాపు 326 మంది మృత్యువాత పడినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా 600కు పైగా గాయపడ్డారు. తుర్కియా దేశంలో ఇప్పటి వరకు 912 మంది మరణించినట్లుగా దేశ అధ్యక్షుడు వెల్లడించారు. 5300 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. రెండు దేశాలలో భారీ సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.