రాష్ట్రంలో ఎంసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష తేదీలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఉన్న‌త విద్యామండ‌లి ఖ‌రారు చేసింది. మే 7వ తేదీ నుండి 14వ తేదీ వ‌ర‌కు ఎంసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. మే 7 నుండి 11వ తేదీ వ‌ర‌కు ఎంసెట్ ఇంజినీరింగ్‌, 12 నుండి 14వ తేదీ వ‌ర‌కు ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మా ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఇక మే 18వ తేదీన ఎడ్ సెట్, ఉపాధ్యాయ వృత్తి విద్య‌కోర్సుకు సంబంధించిన ప్రేవేశ ప‌రీక్ష జ‌ర‌గనుంది. మే 20న ఈ సెట్‌, మే 25వ తేదీన లాసెట్‌, పిజి ఎల్‌సెట్ జ‌ర‌గ‌నున్నాయి. అదేవిధంగా మే 26,27వ తేదీల్లో టిఎస్ ఐసెట్ మే 29వ తేదీ నుండి జూన్ 21 వ‌ర‌కు టిఎస్ పిజిఇసిఇటి ప్ర‌వేశ ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌ణ జ‌ర‌గ‌నున్న‌ట్లు ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your email address will not be published.