న‌టాషా ప‌రియ‌న‌గ‌మ్: ప్ర‌పంచంలోనే తెలివైన విద్యార్థుల జాబితాలో చోటు

 

ఆమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీకి సంబంధించిన సెంటర్ ఫ‌ర్ టాలెంట‌డ్ యూత్ (సిటివై) నిర్వ‌హించిన పోటీల్లో ఇండియ‌న్ అమెరిక‌న్ విద్యార్థి న‌టాషా ప‌రియ‌న‌గ‌మ్ అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచింది. సిటివై ప్ర‌తి సంవ‌త్స‌రం విభిన్న ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంట‌ది. ఈ సారి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత చురుకైన విద్యార్థులు, త‌మ వ‌య‌స్సు వారికంటే ఎక్క‌వ తెలివితేట‌లు క‌లిగిన వారిని వెలికితేసే పోటీలు నిర్వ‌హించింది.
ప్ర‌పంచం మొత్తంమీద 76 దేశాల నుండి 15 వేల‌మందికి పైగా విద్యార్థులు పాల్గొన‌గా.. 27% మంది అర్హ‌త సాధించారు. వారిలో న‌టాషా ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది.

న‌టాషా ప‌రియ‌గ‌మ్ న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ స్కూల్‌లో ఐద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతుంది. ఆమె ఎనిమిద‌వ త‌ర‌గ‌తి విద్యార్థి స్థాయి ప్ర‌తిభ‌ను చాటింది. ఆమె 2021లో కూడా ఈ ప‌రీక్ష‌ల్లో పాల్గొని త‌న‌ ప్ర‌తిభ‌ను చాటింది. అపుడు తెలివైన విద్యార్థుల జాబితాలో చోటు ద‌క్కించుకున్న న‌టాషా తాజాగా ఈ ఏడాది నిర్వ‌హించిన పోటీల్లో ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఈ సంద‌ర్బంగా (సిటివై) డైరెక్ట‌ర్ మాట్లాడుతూ. . ఇక ప‌రీక్ష‌లో విద్యార్థులు సాధించిన విజ‌యాన్ని గుర్తించ‌డం మాత్ర‌మే కాద‌ని.. నేర్చుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌, ఆస‌క్తితో త‌మ వయ‌స్సు వారికంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించ‌డం అనేది మ‌నం గుర్తించాల్సిన విష‌యం అని అన్నారు. నాటాషా త‌ల్లి దండ్రులు త‌మిళ‌నాడులోని చెన్నైకి చెందిన వారు. ఉద్యోగ రీత్యా వారు అమెరికాలో స్థిర‌ప‌డ్డారు.

Leave A Reply

Your email address will not be published.