నేను మీకు స‌రైన కొడుకును కాదు.. సూసైడ్ నోట్ రాసి యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): నేను స‌రైన కొడుకును కాదు.. అని సూసైడ్ నోట్ రాసి ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని బాలాన‌గ‌ర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బాలా న‌గ‌ర్‌కు చెందిన సాయికుమార్ త‌ప్పులు చేశాను.. స‌రిదిద్దుకోలేక‌పోతున్నాను.. నేను స‌రైన కొడుకుని కాను.. త‌మ్ముడిని బాగా చూసుకోండి అని సూసైడ్ నోట్ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సాయి కుమార్ త‌న త‌మ్ముడి డ‌బ్బులు వాడుకున్నందుకు త‌ల్లి మంద‌లించింద‌నే కార‌ణంతో సోమ‌వారం ఇంట్లోకి వెళ్లి త‌లుపులు గ‌డియ పెట్టుకున్నాడు. కొంత స‌మ‌యం త‌ర్వాత గ‌మ‌నించిన త‌ల్లి స్థానికుల స‌హాయంతో త‌లుపులు ప‌గుల‌గొట్టి చూడ‌గా.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని క‌నిపించాడు. అత‌ని వ‌ద్దనున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.